దక్షిణ భాషా చిత్రాలలో మంచి సక్సెస్ సాధించిన చిత్రాల్లో ‘7/జి బృందావన కాలనీ’ ఒకటి. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ దీనిని ప్రేక్షకులు మరువలేరు. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎం.ఎం. రత్నం ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్స రం సందర్భంగా చి త్ర బృందం ప్రకటించింది. దర్శకుడు సె ల్వరాఘవన్ కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.
మొదటి భాగంలో తన అ ద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన రవికృష్ణ, మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. కథానాయికగా అనశ్వర రాజన్ నటిస్తోంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం గురిం చి నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడు తూ “7/జి బృందావన కాలనీ’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం. సినీ చరిత్రలో ఈ చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్‌తో నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త, ఆకట్టుకునే కథనాన్ని అందించి, అప్పటి మ్యా జిక్‌ను పునఃసృష్టి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలి పారు.