calender_icon.png 26 December, 2024 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28న ఆదిలాబాద్‌కు బృందాకరత్

04-11-2024 02:11:34 AM

సీఐటీయూ రాష్ర్ట కార్యదరి రమేశ్

ఆదిలాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ర్ట ప్రభుతాలు అవలంబిస్తున్న కార్మిక, కరక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ర్ట కార్యదరి కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కార్మిక పోరాటాల సారథి బాశెట్టి మాధవరా వు విజ్ఞాన కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన సీఐటీయూ జిల్లా కార్యాలయా న్ని మాజీ ఎంపీ, కామ్రేడ్ బృందా కర త్ ఈనెల 28న ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమానికి మా జీ ఎంపీ మీడియం బాబురావు, పాలడుగు భాస్కర్,జయలక్ష్మి, బండారు రవికుమార్  హాజరవుతారని వెల్లడించారు.

ప్రారంభోత్సవ సభకు జిల్లా కార్మికుల హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో యూ నియన్ జిల్లా అధ్యక్ష, కార్యదరులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, కోశాధికారి సునీత, ఉపాధ్యక్షుడు దరనాల మల్లేశ్, గంగన్న, అగ్గిమల్ల సామి  పాల్గొన్నారు.