26-04-2025 08:15:40 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): శనివారం ప్రకటించిన ఏకలవ్య మోడల్ స్కూల్ ఫలితాలలో సారపాక బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు బి.కార్తీక శ్రీ, కె.హర్ష గగన్ లు సీట్లు సాధించారు. వారికి బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డా.బి ఎన్ ఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఎన్ఆర్ మాట్లాడుతూ... ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు.