calender_icon.png 23 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాలలో బ్రిలియంట్ విద్యార్థులు ప్రభంజనం

22-04-2025 07:09:37 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ ఫలితాలలో సారపాకలోని బ్రిలియంట్ కళాశాల(Brilliant College) విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు ఆ కళాశాల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో 470 మార్కులకు గాను 461 మార్కులను ఎన్ వెంకట సాయి గణేష్ సాధించాడని, సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో సిహెచ్ దుర్గ భవాని సెకండియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించగా, 72 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను డాక్టర్ బిఎన్ఆర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.