calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన బ్రిలియంట్ విద్యార్థి

19-04-2025 06:52:30 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): శనివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్(JEE Mains) ఫలితాలలో సారపాక బ్రిలియంట్ కళాశాల విద్యార్థిని బి.సంయుక్త ఆల్ ఇండియాలో 7940వ ర్యాంక్ తో సారపాక స్థాయిని జాతీయ స్థాయిలో నిలిపి కార్పోరేట్ కాలేజ్ లకు ధీటుగా సారపాకలో ఎవరూ సాధించని ర్యాంక్ ను సాధించి అడ్వాన్స్ లో అర్హత సాధించి అందరిని అబ్బుర పరిచింది. ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్, నంది అవార్డు గ్రహీత డాక్టర్ బిఎన్ఆర్ బి.సంయుక్త కి స్వీట్స్ తినిపించి అభినందించారు.

అనంతరం బిఎన్ఆర్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతం అయిన సారపాక,భద్రాచలం వంటి ప్రాంతాల నుండి ఎంసెట్, నీట్, మెయిన్స్ లలో ర్యాంక్ లు సాధించడమే లక్ష్యంగా బ్రిలియంట్ విద్యాసంస్థ ముందుంటుందని రాబోయే రోజుల్లో కూడా ఇలానే జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ లు సాధించి విధ్యార్ధుల భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధ్యాపకులు,విధ్యార్ధులు పాల్గోన్నారు.