calender_icon.png 28 December, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిసిన పట్నా పైరేట్స్

09-11-2024 01:21:28 AM

పీకేఎల్ 11వ సీజన్

హైదరాబాద్:  మూడుసార్లు పీకేఎల్ చాంపియన్ పట్నా పైరేట్స్ జైపూర్ పింక్ పాంథర్స్‌పై కష్టపడి నెగ్గింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43-41తో తేడాతో జైపూర్ మీద విజయం సాధించింది. మ్యాచ్ హోరాహోరీగా సాగినా కానీ చివరికి పట్నా విజయం సాధించి.. ఐదు పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. పట్నాలో దేవాంక్‌తో పాటు లెఫ్ట్ రెయిడర్ అయాన్ కూడా సూపర్ టెన్ సాధించాడు.

జైపూర్‌లో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ (20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 39-26తో తమిళ్ తలైవాస్‌పై విజయాన్ని అందుకుంది. వరుస విజయాలు సాధించిన తమిళ్ తలైవాస్‌ను గత మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓడించగా.. తాజాగా ఢిల్లీతో మ్యాచ్‌లో 13 పాయింట్ల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ ఓటమితో తమిళ జట్టు ఖాతాలో హ్యాట్రిక్ ఓటములు చేరాయి.