calender_icon.png 28 February, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిలియంట్ లో బాల మేధావుల అద్భుత ఆవిష్కరణలు

28-02-2025 05:31:39 PM

బూర్గంపాడు: స్థానిక సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ సైన్స్ ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను వీక్షించి చిన్నారులను అభినందించారు. తదుపరి ప్రసంగంలో డాక్టర్ బిఎన్ఆర్ చదువుతో పాటు ఇలాంటి సైన్స్ ఆవిష్కరణలు వారిలో వున్న సృజనాత్మకతకు నిదర్శనం అని వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ముందుండాలంటే శాస్త్ర విజ్ఞానంపై ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి అన్నారు.

భవిష్యత్తులో మేధావులుగా రాణించాలంటే అన్ని రంగాల్లో ముందుండేలా అనేక పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని సంసిద్ధులుగా చేస్తున్నామన్నారు. నవోదయ, సైనిక్, ఒలంపియాడ్ వంటి పోటీ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులను సాధించి దాదాపు 26 ప్రైజ్ లను సొంతం చేసుకున్నందుకు గాను చాలా గర్వంగా ఉందన్నారు. ఇంతటి విజయాలకు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సైన్స్ డే సందర్భంగా తయారుచేసిన ప్రాజెక్టులలో గెలుపొందిన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.