calender_icon.png 18 January, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిజేశ్ ఆదేశాలు.. కేసీఆర్ ప్రభుత్వ విజయం

18-01-2025 12:27:07 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు.. ముమ్మాటికీ కేసీఆర్ ప్రభు త్వ విజయమేనని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా జలాల కేటా యింపు విషయంలో 1956 అంతరాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చి న ఫలితమే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీ గా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించడం వల్ల నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందన్నారు. కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దడానికి పదేండ్ల కాలం తమ ప్రభుత్వానికి పట్టిందన్నారు.

నాడు కేసీఆర్ సీఎం హోదా లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణ పక్షాన వాదనలు వినిపించారని, దీంతో తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తు చేశారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్‌కి రిఫర్ చేయడానికి అంగీక రించిందన్నారు.