23-03-2025 12:00:00 AM
అందంగా కనిపించాలంటే చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ చర్మం మెరుస్తూ ఉండాలి. ఇందుకు చాలామంది ఖరీదైన క్రీములు వాడతారు. కాని, ఇంట్లో ఉండే రోజ్ వాటర్‌తో అందంగా మెరిసిపోవచ్చు.
ఎండబారిన పడినప్పుడు చర్మం వేడిగా, మంటగా ఉంటుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌ను స్ప్రేగా ఉపయోగిస్తూ ఈ అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.
ఇది మంచి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్ వాటర్ రాసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చర్మం తాజాగా, మెరుస్తూ ఉంటుంది.
స్కిన్ టోన్‌ను సాఫ్ట్‌గా మారుస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్ వాటర్ రాసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చర్మం తాజాగా, మెరుస్తూ ఉంటుంది.
నిత్యం రోజ్ వాటర్ వాడటం వల్ల వృద్ధాప్య ఛాయలను త్వరగా దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ-ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
పెర్ఫ్యూమ్ అంటే అంతగా ఇష్టపడని వారు రోజ్ వాటర్‌ను మణికట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆహ్లాదకంగా ఉంటుంది.