calender_icon.png 30 October, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని గోదావరిపై వంతెన

10-08-2024 05:06:55 AM

  1. నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు కృషి 
  2. అమాత్యులచే పనుల ప్రారంభానికి కసరత్తు 
  3. త్వరలోనే నెరవేరనున్న దశాబ్దాల కల

మంథని, ఆగస్టు 8(విజయక్రాంతి): పెద్ద పల్లి జిల్లా మంథని నియోజకవర్గంతో పాటు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా ప్రజల దశాబ్దాల కలను నిజం చేయబోతున్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. పెద్దపల్లి జిల్లా మంథని సమీ పంలోని గోదావరి నదిపై వంతెన నిర్మాణా నికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో వంతెన ను నిర్మించనున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇతర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభిం చేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ఏర్పాటు చేస్తున్నారు.

వంతెన నిర్మాణం జరిగితే మంథనితో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు, రామగుండం, భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరను న్నది. అలాగే మహారాష్ట్ర వెళ్లేందుకు దూర భారం తగ్గుతుంది. దీంతో ప్రగతికి నిలువుట ద్దంగా మంత్రి శ్రీధర్‌బాబును ప్రజలు కొని యాడుతున్నారు. 

మంథని నుంచి చెన్నూరుకు గంట ప్రయాణం..

మంథని గోదావరి నదిపై వంతెన నిర్మా ణం జరిగితే మంథని నుంచి మంచిర్యాల జిల్లా చెన్నూరుకు కేవలం గంటలోనే చేరుకో వచ్చు. ప్రస్తుతం మంథని నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల, చెన్నూరు, కోటపల్లి, జైపూరు ప్రాంతాలకు గోదావరిఖనికి వెళ్లి, అటు నుంచి మంచిర్యాల జిల్లా శ్రీరాం పూర్‌కు చేరుకొని, అక్కడి నుంచి చెన్నూరు కు వెళ్తున్నారు. వంతెన నిర్మాణం జరిగితే మంథని గోదావరి మీదుగా శివ్వారం, సోమనపల్లి, ఆస్నాద్ నుంచి కేవలం గంటలోనే చెన్నూరుకు చేరుకోవచ్చు. 

పర్యాటక కేంద్రంగా ఎల్ మడుగు 

మంచిర్యాల జిల్లా గోదావరి నది అవత ల శివ్వారం అటవీ మార్గంలో చారిత్రాత్మక ఎల్ మడుగు ఉంది. ఈ ఎల్ మడుగును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పు డు గోదావరి నది మీద వంతెన నిర్మాణం పూర్తయితే ఎల్ మడుగు పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చెందడమే గాకుండా ఆ ఘనత మంత్రి శ్రీధర్‌బాబు ఖాతాలోనే పడనుంది.

మంథని దశ మారుతుంది

మంత్రి శ్రీధర్‌బాబు ముందుచూపు తో మంథని దశ మారోబోతుంది. మంథ ని పరిధిలోని గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మంథని పట్టణం రూపురేఖలు మారుతాయి. ఇప్పటికే మంథని అభివృద్ధికి దాదాపు రూ.33 కోట్లు మంత్రి శ్రీధర్‌బాబు మంజూరు చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో మరింత అభి వృద్ధి చెందుతుంది. మంథనికి భారీగా నిధులు తీసుకువస్తున్న మంత్రి శ్రీధర్‌బా బుకు కృతజ్ఞతలు.

 పెండ్రు రమాసురేష్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్, మంథని