ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
లక్నో, జనవరి 5: కల్యాణ మండపంలో పెండ్లి జరుగుతున్నది. పురో హితుడు వేదమంత్రాలు చదువుతున్నాడు. మరి కొద్ది నిమిషాల్లో పెండ్లి కొడుకు తాళి కట్టనున్నాడు. ఈలోపే వధువు బాత్రూంకు వెళ్లి వస్తానని నగలతో ఉడాయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఖాజ్నీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి గతంలో వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు భార్య కన్నుమూసింది.
దీంతో ఆ వ్యక్తి మళ్లీ పెండ్లికి సిద్ధమయ్యాడు. వధువుకు ఎదురుకట్నం ఇచ్చేందుకు సిద్ధమై రూ.30 వేలు ఇచ్చిమరీ మధ్యవర్తిని కుదుర్చుకున్నాడు. మధ్యవర్తి ఇటీవల ఓ సం బంధం తీసుకురాగా, పెండ్లి ఖర్చులు భరించడంతో పాటు ఆభరణాలు కా నుకగా ఇస్తానని ఒప్పుడకున్నాడు.
దీంతో గత నెల చివర్లో ముహూర్తం ఫిక్స్ అయింది. పెండ్లి రోజు వధూవరులను మండపంలోకి కూర్చోబెట్టి పురోహితుడు వివాహతంతు జరిపిస్తున్నాడు. ఈక్రమంలో వధువు బాత్రూంకు వెళ్లాలని చెప్పి, తన తల్లిని వెంటబెట్టుకొని ఆభరణాలతో ఉడాయించింది. వధువు ఎంతకీ వేదికపైకి రాకపోవడంతో అనుమానం వచ్చి వరుడి బంధువులు బాత్రూం తెరిచి చూశారు. దీంతో వరుడు మోసపోయానని గుర్తించి ఖిన్నుడయ్యాడు.