25-03-2025 09:04:44 PM
కామారెడ్డి జిల్లా కొల్లూరులో ఘటన..
బాన్సువాడ (విజయక్రాంతి): పెళ్లయిన రెండు రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లూరు గ్రామానికి చెందిన వెంకటేష్ కు ఈనెల 23న వల్లపు లక్ష్మితో వివాహమును తల్లిదండ్రులు జరిపించారు. నవ వధువు ఓల్లపు లక్ష్మి(18)కి పెళ్లి ఇష్టం లేక మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఇంట్లో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు చూసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పెళ్లి ఇష్టం లేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకోవడంతో కుటుంబ సభ్యులు చూసి ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఒల్లెపు చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ సిఐ అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.