calender_icon.png 24 November, 2024 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవవధువు ఆత్మహత్య

13-11-2024 12:25:09 AM

రాజేంద్రనగర్, నవంబర్ 12: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి కథనం ప్రకారం.. అత్తాపూర్ రాంబాగ్ ప్రాంతంలో ప్రవీణ్, సిద్ధేశ్వరి (20) దంపతులు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వీరికి 7 నెలల క్రితం వివాహం జరిగింది.

ప్రవీణ్ ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం భర్త, మరిది ఉద్యోగాలకు వెళ్లారు. అత్తామామ పని నిమిత్తం ఊరికి వెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో సిద్ధేశ్వరి మామ ఇంటికి వచ్చి కోడలిని ఎంత పిలిచినా ఫలితం లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కోడలు ఫ్యాన్‌కు ఉరివేసుకొని కన్పించింది. విషయాన్ని అత్తాపూర్ పీఎస్‌లో తెలపగా ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.