calender_icon.png 23 November, 2024 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసును కొట్టేసేందుకు లంచం డిమాండ్

23-11-2024 12:01:40 AM

ఏసీబీ వలలో ఖాకీలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ముగ్గురు ఖాకీలు ఏసీబీకి పట్టుబడ్డారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆర్.పవన్ ఓ బాధితుడిపైన నమోదైన కేసును కొట్టివేయడానికి రూ.30వేల లంచం డిమాండ్ చేశాడు. చివరికి రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్సై తరపున రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ రామక్రిష్ణను శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే కేసు కొట్టివేయాలంటే తనకు రూ.2వేలు ఇవ్వాల్సిందిగా మరో కానిస్టేబుల్ సంతోష్ అడగడంతో.. అతడికి రూ.2 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.