calender_icon.png 31 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారసత్వం మార్పుకు లంచం డిమాండ్

02-08-2024 01:49:36 AM

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ సిబ్బంది

పటాన్‌చెరు, ఆగష్టు 1: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో  వారసత్వం మార్పు సర్టిఫికెట్ కోసం గురువారం రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ధరణి ఆపరేటర్ చాకలి ఆరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామచంద్రాపురం రెవెన్యూ పరిధిలోని బండ్ల గూడకు చెందిన వెంకటేశ్ యాదవ్ తమ ఆస్తికి సంబంధించి వారసత్వ మార్పు కోసం అమీన్‌పూర్ రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్, ధరణి ఆపరేటర్ చాకలి అరున్ కుమార్ అతడి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యం లో వెంకటేశ్ యాదవ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం ఉదయం అమీన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో.. చాకలి అరున్ కుమార్‌కు వెంకటేశ్ యాదవ్ రూ.30 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నిందితులు అరుణ్, సంతోష్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. అమీన్ పూర్ తహసీల్దార్ రాధ.. ఛాంబర్, ఇంటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.