calender_icon.png 9 February, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపిరాడక..

27-01-2025 12:00:00 AM

నేను చేపను ముట్టలేదెప్పుడూ కానీ--సాగుదారుల ఉప్పు క్షేత్రాల్లో ఆ బ్యాక్ వాటర్స్ దగ్గర ఓ గేలం పట్టుకుని చేపలు పట్టే సరదాతో నా బాల్యం అంతా గడిచింది.

అప్పుడే చేపలతో నా చెలిమి

కొలనులో పూలు కోసుకునే వేళల్లో

నన్ను గిలిగింతలు పెట్టింది

స్వచ్ఛ జలపుష్పం ఆ చూట్టాచియే!

నీట లిల్లీపువ్వులను దువ్వుతూండే నా చూపుకు

ఈ లోకం ఆ ఓజల్ నీటి చేపలాంటిదే

ఎట్టా, ముల్లన్ ఎన్నెన్నో చేపలు

ఇప్పుడు ఎండిన నేలపై పడి

ఊపిరాడక గిలగిల్లాడుతున్న చేపలా వుంది

ఈ తిరస్కృత విస్తృత ప్రపంచం.

సాగునీటి భూములు ఎండిపోయి

కన్నీటితో నిండిపోయాయి

ఈ నేల ‘ఉప్పన’ పాలయ్యింది.

పొక్కుడన్ చెప్పగా చెప్పగా

చెట్ల పొదలు తలలూపుతూ 

ఔనౌను అంటున్నాయి

ఖండించే శ్రామికుల చేతుల్లో వంపులతో

హస్తరేఖలే చెరిగిపోతున్నాయి

పరిధుల మేరకు బాధను 

నేను ప్రేమిస్తూనే వచ్చాను

పాపం! పక్షులు ఎన్ని విత్తనాలు 

మోసుకు వెళ్ళడం లేదు?

నేల- చీకట్ల భూభాగాలూ వుంటాయి

మన ఇంటిలోపల గురించి ఎప్పుడూ

మనం పట్టించుకోనే లేదు

నేను కవిని

నా దగ్గర స్వప్నాల దస్తావేజులకు కొరత లేదు

పచ్చదనం లేక ఎండిన నేల 

ఊపిరాడని ప్రతిరూపంలో

నువ్వు వేదాధ్యయనం కోసం 

పుస్తకాల పేజీలు తిప్పుతూంటే

నేను హరిత వృక్షాలకోసం యత్నిస్తూంటాను

వాటిని ఒక్కటిగా చదవ చూస్తుంటాను

అందమైన రంగురంగుల 

భవంతులు నిర్మించుకోవడానికి

ఈ ఆధునిక ప్రపంచంలో

మూలాలను పెళ్లగించి నిర్మూలించే వారెందరో

ఆ మూలాలకు పేరేది.. అవన్నీ అనాథలు

గుండె గొంతుకలోన కొట్టాడి పెగలక

ప్రాణాలు హరించుకు పోతున్నాయి.

పూత సమయంలోనే చూర్ణమవుతున్నాయి

భూమిమీద ఏదో ప్రాణిగా తప్పక జన్మిస్తాయి

నాలుగు, ఎనిమిది వరసల

పొడుగాటి రోడ్లు వేగిరంగా విస్తరిస్తున్నాయి

ఇక నిలబడేందుకు, పడుకునేందుకు

ఈ భూమిమీద చోటేదీ మిగిలేలా లేదు.

సుధామ 

(తెలుగు అనువాదం) 

9849297958