calender_icon.png 22 December, 2024 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరాల ఊపిరి

28-10-2024 12:00:00 AM

తలెత్తిన మైదానంలో ఆట

విస్తరి పరిచిన అక్షరం

వ్యాపించిన ప్రపంచమంతా 

వికసించిన ప్రకృతిలో విద్యార్థులు 

తడితడి వేళ్ళు నిమిరిన చదువుల మడి 

బడి ఎంత గొప్ప నుడి సవ్వడి తారల

నేల వాకిట చుక్కల ముగ్గు 

ఎంచక్కా గీసింది అక్క చెయ్యి 

ఊపిరి పోసినట్టు 

మిలమిల మెరిసే ఆకాశం చుక్కలతో 

తళతళలాడే వెండి వెన్నెల 

రంగవల్లిక సోయగం

అమ్మలక్కల అరచేయి పూచిన 

గోరింట అందాలు  

సుందర స్వప్నంలోంచి తాజాగా 

తేరుకున్న సహజ సుమాలు 

రవివర్మకే దొరకని ఒకానొక అపురూపం

ఏ కవి ఊహల అందని అక్షర కావ్యం

మనిషికీ మనసుకూ ముడివేసిన బతుకున

మానవీయ కళలన్నీ  

అక్షరాల ఊపిరులూదే భావోద్వేగాల పుటలే.

-  డా.టి.రాధా

కృష్ణమాచార్యులు