స్టార్ హాస్పిటల్ సర్జన్ కిన్నెరరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీకి సురక్షితమైన, ప్రభావవం తమైన వైద్యం అందుబాటులో ఉందని నానక్‌రాంగూడ స్టార్ హాస్పిటల్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ అండ్ ఆస్తెటిక్ సర్జరీ ఇల్యూమినా) డాక్టర్ కిన్నెరరెడ్డి గురువారం తెలిపారు. ఈ సర్జరీ మహిళ ల్లో రొమ్ముల ఆకారం, రూపాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుందని చెప్పారు. ‘మాస్టెక్టమీ’ శస్త్రచికిత్స తర్వాత వారు మళ్లీ సంపూర్ణ అనుభూతి చెందుతారని స్పష్టం చేశారు. బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ కేవలం శరీరాన్ని పునరుద్ధరించడం గురించి మాత్రమే కాదు.. వ్యక్తిగత గుర్తింపు, ఆత్మస్థుర్యైం పొందేలా చేస్తుందని వెల్లడించారు.
‘మాస్టెక్టమీ’కి డిమాండ్
మాస్టెక్టమీ శస్త్రచికిత్సకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. క్యాన్సర్ నుంచి కోలుకు న్న మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రీకన్‌స్ట్రక్షన్‌కు వయసు పరిమితి లే దు. ఈ సర్జరీని రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ఇంప్లాంట్ ఆధారిత రీకన్‌స్ట్రక్షన్.. అం టే సిలికాన్ లేదా సాలైన్ ఇంప్లాంట్‌లను ఉపయోగించి చేయడం. రెండోది.. ఆటోలోగస్ రీకన్‌స్ట్రక్షన్ (ఫ్లాప్) అంటే కడుపు, తొడ, లేదా వెనుక భాగం వంటి శరీర ఇతర భాగాల నుంచి కణజాలాన్ని తీసుకొని రీకన్‌స్ట్రక్షన్ చేయడం. ఇంప్లాంట్ రీకన్‌స్ట్రక్షన్‌కు సాధారణంగా 4-6 వారాలు.. ఫ్లాప్ సర్జరీకి 6-8 వారాలు పడుతుందని డాక్టర్ కిన్నెర వివరించారు.