12-04-2025 12:28:15 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 11 (విజయక్రాంతి)అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి నుండి అం దించే ముర్రుపాలే అత్యంత శ్రేయస్కరమని అందుకు బాలింతలు పోషక ఆహారాన్ని తీ సుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ శోభారాణి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రం లోని అంగన్వాడి కేంద్రం 2లో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని గర్భిణీ బాలింతలకు పోషకాహార పట్ల అవగాహన కల్పించారు. తాజా ఆకుకూరలు, పాలు, గుడ్లు, బెల్లం పట్టీలు వంటివి విరివిగా తీసుకోవాలని ఎనిమియా నుండి జాగ్రత్త పడాలని సూచించారు.