calender_icon.png 25 December, 2024 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెస్ట్ క్యాన్సర్.. బీకేర్‌ఫుల్

22-10-2024 12:00:00 AM

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మన దేశంలో క్యాన్సర్ గణనీయంగా పెరుగుతున్నట్టు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) గుర్తించింది. తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అయితే  బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన, అప్రమత్తతోనే అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్లలో సుమారు 10శాతం జన్యుపరమైనవి అయినప్పటికీ, ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణం. రొమ్ము క్యాన్సర్ సాధారణంగా 40--60 సంవత్సరాల వయస్సు గల మహిళలపై ప్రభావితం ఎక్కువ ఉందని, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతులు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

20--40 సంవత్సరాల వయస్సు గల మహి ళల్లో నెలకు 20--25 కేసులు వస్తున్నాయని అంటున్నారు. హార్మోన్ థెరపీ, రుతుక్రమం ఆగిపోయిన చికిత్సలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. వీటికితోడు జీవనశైలి మార్పులు, ఆలస్యంగా ప్రసవించడం, తల్లి పాలు ఇవ్వకపోవడం, ఊబకాయం, ఆహారం వంటివి మహిళల్లో రొమ్ము క్యాన్స ర్స్ కారణమవుతున్నాయి.

భారతదేశంలో చాలామంది మహిళలు 50 సంవత్సరాల కంటే ముందే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి 21 ఏళ్ల వయసులోనే రొమ్ము పరీక్షలు చేసు కోవాలని వైద్యులు సూచిస్తున్నారు .

కారణాలు ఇవే

* రొమ్ము కణజాలంలోని ఏదైనా మార్పు వచ్చినప్పుడు రొమ్ము క్యాన్సర్ మొదలవుతుంది. 

* 12 ఏళ్లలోపు పీరియడ్స్ ప్రారంభం కావడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

* రొమ్ము కణజాలంతో జన్మించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుంది

* ఆల్కహాల్ తాగడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ

* వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రమాదం 

* డీఎన్‌ఏ మార్పులు, తల్లిదండ్రుల నుంచి ఊబకాయం ఉన్నవారికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

* యుక్త వయస్సులో రేడియేషన్ ట్రీట్ మెంట్ తీసుకున్నవారిపై ప్రభావం పడుతుంది

ఇలా నివారిద్దాం

* రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అవగాహన కల్పించుకోవాలి.

* ధూమపానం, ఆల్కహాల్ మానేయాలి

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

* బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

* క్యాన్సర్ సాంకేతకాలు ఉన్నట్టయితే ఆంకాలజిస్ట్‌ను క్రమతప్పకుండా సంప్రదించాలి 

* మందులు లేదా శస్త్రచికిత్స తీసుకోవాడానికి సిద్ధంగా ఉండాలి. 

క్యాన్సర్ దశలు

ప్రారంభ దశ : వ్యాధి రొమ్ము నాళాల నుంచి ఇతర భాగాలకు వ్యాపించదు.

దశ I : రొమ్ము కణజాలంలో క్యాన్సర్ కణాలుంటాయి. 

దశ II : క్యాన్సర్ కణాలు కణితి లేదా కణితులను ఏర్పరుస్తాయి. 

దశ III : సమీపంలోని కణజాలం, శోషరస          కణితులలో రొమ్ము క్యాన్సర్ ఉంటుంది. స్టేజ్ III సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌గా సూచించ బడుతుంది.

దశ IV : రొమ్ము నుంచి ఎముకలు, కాలేయం , ఊపిరితిత్తులు లేదా మెదడు ఇతర ప్రాంతాలకు వ్యాపించడం

చికిత్స ఎలా?

* రేడియేషన్ థెరపీ

* కీమోథెరపీ

* హార్మోన్ నిరోధించే చికిత్స

* రొమ్ము క్యాన్సర్ దశలను బట్టి ట్రీట్‌మెంట్

* మాస్టెక్టమీ (మొత్తం రొమ్మును తొలగించడం)

* ఆక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ (అనేక శోషరస కణితుల తొలగింపు)

* లంపెక్టమీ (రొమ్ము క్యాన్సర్ తొలగింపు)

ఆత్మస్థైర్యంతో పోరాడా..

నాకు క్యాన్సర్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. రొమ్ము క్యాన్సర్ గ్రేడ్- బారిన పడ్డాను. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు తొమ్మిది విడతల కిమోథెరపీ చేయించు కున్నా. అందమైన రూపం కోల్పోయా. అయి నా నవ్వుతూ ధైర్యంగా పోరాడా. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రస్తుతం బిజీగా ఉన్నా. కొందరికి జన్యుపరంగా క్యాన్సర్ సోకితే.. మరికొందరికి ఆహారపు అలవాట్లతో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తిస్తే చాలా మేలు జరుగుతుంది. 

 హంసా నందిని, సినీ నటి

సానుకూల దృక్పథంతో..

కంటికి కనపడని నొప్పిని పంటిబిగువున భరించా. సానుకూల దృక్పథంతో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను జయించా. కిమోథెరపీల వల్ల జుట్టు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోలేదు. కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో వ్యాధిపై పోరాటం చేశా.

రొమ్ము క్యాన్సర్‌ను మొద టి దశలోనే స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. ప్రమాదవశాత్తు క్యాన్సర్ బారిన పడితే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విలువైన జీవితాన్ని కోల్పోతాం. అందుకే ప్రతిఒక్కరికి అవగాహన అవసరం.         

సోనాలి బింద్రే, సినీ నటి