calender_icon.png 28 October, 2024 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అవసరం

28-10-2024 12:32:54 AM

  1. హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా 
  2. రెనోవా సెంచరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పింక్ రన్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మహిళలు సరైన జీవన శైలితో పాటు క్రమం తప్పకుండా వ్యాయా మం చేసినట్లయితే రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, నివారించవచ్చని హైకోర్టు జడ్జి జస్టీస్ సూరేపల్లి నందా అన్నారు.

రొమ్ము క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్ ప్రాముఖ్యత గురించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని రెనోవా సెంచరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ ఆసుపత్రి ప్రాంగణం నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ సిటీ సెంటర్ రోడ్ దాకా ఆదివారం 3 కిలోమీటర్ల పింక్‌వాక్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జెండాఊపి ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జీవనశైలి, ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటిలో క్యాన్సర్ ముఖ్యమైందన్నారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్‌లలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఇటీవల కాలంలో అత్యధికంగా కన్పిస్తున్నాయని.. దీనిపట్ల మహిళలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.

ధూమాపానం, ఆల్కాహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రెనోవా చీఫ్ కన్సలెం ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీఈవో రవీంద్రనాథ్ గరగ, వైద్యులు డాక్టర్ కె.శ్రీనివాస రావు, డాక్టర్ ఉదయ్ కుమార్ పునుకొల్లు, డాక్టర్ ఆశ్విన్ పండిట్, డాక్టర్ నిషిత్ వడ్డెబోయిన, డాక్టర్ ఎస్. అర్జున్ తదితరులు పాల్గొన్నారు.