calender_icon.png 8 January, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎముకలు విరిచి.. గుండెను చీల్చి..

07-01-2025 01:12:57 AM

* పాశవికంగా ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్ హత్య

రాయ్‌పూర్, జనవరి 6: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రకర్ హత్యకేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా అతడి పోస్ట్‌మార్టం రిపోర్ట్ విడుదలైంది. నిందితులు ముఖేశ్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు స్పష్టమవు తోంది.

కాగా కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్‌ను ఆదివారం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తలపై 15 పగుళ్లు ఉన్నట్లు తేల్చారు.  మెడ విరిగిపోయిందని, గుండె బయటకు వచ్చినట్లు గుర్తించారు. ముఖేశ్ జనవరి 1న అదృశ్యమయ్యాడు.

3న అతడి శవం బీజాపూర్‌లోని ఛత్తన్‌పారా బస్తీలో అతడి ఇంటివద్ద సెప్టిక్ ట్యాంక్‌లో లభించింది. ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ పనుల్లో జరిగిన అవినితీపై కథనాన్ని ప్రచురించడమే హత్యకు కారణంగా తెలుస్తోంది.