calender_icon.png 25 November, 2024 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదయం వంటే రాత్రి భోజనం!

25-11-2024 12:50:20 AM

  1. ప్రభుత్వ హాస్టళ్ల పనితీరు అధ్వానం 
  2. అధికారుల పర్యవేక్షణ కరువు
  3. ఇష్టారాజ్యంగా వార్డెన్, సిబ్బంది తీరు 
  4. అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు 

నాగర్‌కర్నూల్, నవంబర్ 24 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్ల పనితీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు ఉదయం పెట్టిన ఉడికి ఉడకని భోజనమే రాత్రికి కూడా వడ్డిస్తుడటంతో దాన్ని తినలేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

కొందరు తప్పనిపరిస్థితుల్లో తిని జీర్ణం కాక విషంగా మారి ఫుడ్‌పాయిజన్ జరిగి వాంతులు, విరేచనాలతో ఆసు పత్రుల్లో చేరుతున్నారు. హాస్టళ్లలోనే ఉండి, విద్యార్థుల సమస్యలు, వారి యోగక్షేమాలను పరిశీలించాల్సిన వార్డెన్లు చుట్టం చూ పుగా వెళ్లి వస్తున్నారు.

కింది స్థాయి సిబ్బందికి, వర్కర్లకు బాధ్యతలను అప్పగిస్తూ వారు మాత్రం జల్సా ల బాట పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవ డటంతో విద్యార్థుల కష్టాలు పట్టించుకునే వారే కరువయ్యారు. 

ఛార్జీలు పెరిగినా..

విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పెంచాలన్న ఉద్దేశంతో పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాస్మోటిక్, మెనూ ఛార్జీలను పెంచింది. కానీ వంట ఏజెన్సీలు మాత్రం తమ తీరు మార్చుకోకుండా అదే నాసిరకమైన కూరగాయలు, ఉడికి ఉడకని భోజనంతో పాటు నీళ్ల చారు వడ్డించి సరి పెడుతున్నారు. నాణ్యమైన భోజనం కోసం ప్రశ్నించే విద్యార్థుల పట్ల వంట ఏజెన్సీలు, కింది స్థాయి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 

ఉడకని అన్నం, కడగని గిన్నెలు

ఉదయం వండి వడ్డించగా మిగిలిన భోజనాన్ని రాత్రికి కూడా పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో ఉదయం వండిన గిన్నెలను పూర్తిగా కడగకుండా అదే గిన్నెలో భోజనం తయారు చేయడంతో విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కలుగుతున్నాయి.

ఏజెన్సీలు కుళ్లిపో యిన కూరగాయాలు సరఫరా చేసినా పట్టించుకోకుండా కిందిస్థాయి వాటిని శు భ్రం చేయకుండానే వండిపెడుతున్నారు. ఫుడ్‌పాయిజన్‌గా మారి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 29 ప్రీమెట్రిక్ హాస్టళ్లు, మరో 6 కళాశాల స్థాయి విద్యార్థుల హాస్టళ్లు మొత్తంగా 35 ఎస్సీ హాస్టళ్లలో 3,355 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు.

బీసీ హాస్టళ్లు సుమారు 22 పాఠశాల స్థాయి, మరో 8 కళాశాల స్థాయి హాస్టళ్లలో 2,900 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. కానీ ఆయా వంట ఏజెన్సీ వారు అదనంగా ఉన్నట్లు విద్యార్థుల లెక్కలను రాసుకుని భోజన బిల్లు లు మెక్కేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

వార్డెన్ల జల్సాలు.. సిబ్బంది ఇష్టారాజ్యం

ప్రతి హాస్టళ్లలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు జరిపి ఆహార నాణ్యత, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలి. హాస్టళ్లపై నమ్మకం, భద్రత విషయంలో అక్కడే బస చేయాల్సి ఉంది. కానీ అధికారులెవ్వరూ కూడా హాస్టళ్లను పట్టించుకోవడం లేదు.

అక్కడే విధుల్లో ఉండాల్సిన వార్డెన్లు డుమ్మా కొట్టి జల్సాల బాట పట్టారు. దీంతో కింది స్థాయి సిబ్బంది ఆడిందే ఆటగా మారింది. వంట ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగుల ఎంపికలోనూ గత పాలకులు కొందరిని ఎంపిక చేసి వంటింటికే పరిమితం చేసినా.. వారికి హాస్టల్‌లో డ్యూటీ వేస్తున్నట్లు జీతాలను పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

నాణ్యత లోపిస్తే చర్యలు

ప్రస్తుతం జిల్లాలో ఇన్‌చార్జి హాస్టల్ వార్డెన్లతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉన్నది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి వార్డెన్ల నియామకం జరుగనుంది. అయినప్పటికీ ప్రతి హాస్టల్ వార్డెన్ విధిగా ఉండేలా చూసుకుం టాం. విద్యార్థులకు భోజన విషయం లో మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారినై చర్యలు తీసుకుంటాం. భోజనంలో నాణ్యత లోపిస్తే క కారకులపై కఠిన చర్యలు తప్పవు.

 శ్రావణ్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, నాగర్‌కర్నూల్