calender_icon.png 13 October, 2024 | 5:33 PM

భూకబ్జా ప్రయత్నాలకు 'బ్రేక్'

13-10-2024 03:17:48 PM

సోషల్ మీడియా పోస్టులకు స్పందించిన రెవెన్యూ అధికారులు 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని ఆకనపల్లి శివారులో గల సర్వే నంబర్ 3, 3 పైకి గల అసైన్డ్ ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టించి ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. సర్వే నంబర్ 3, 3 పైకి అసైన్డ్ భూముల్లో మండలానికి చెందిన నాయకుడొకరు కబ్జా చేసి రియల్ ప్లాట్లు గా మార్చి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని బెల్లంపల్లికి చెందిన ఒక సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంతో సర్వే నెంబర్ 3, 3 పైకి లో గల భూమి పూర్తిగా అసైన్డ్ భూమి గా వెల్లడి కావడంతో అధికారుల్లో చలనం వచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కానంతవరకు జరిగిన కమర్షియల్ నిర్మాణాలపై అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే సర్వే నెంబర్ 3, 3 పైకి లో జరుగుతున్న నిర్మాణాలను నియంత్రించడంలో అధికారులు ఇప్పటికీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలను మూట కట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల ఫలితంగా సదరు నాయకుని భూ కబ్జాకు బ్రేక్ పడినట్లుంది. దీనిపై మునుముందు అధికారులు ఎలా వివరిస్తారో చూడాలి మరి.