calender_icon.png 15 January, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్‌ట్రెండ్‌కు బ్రేక్

12-09-2024 12:46:10 AM

  1. సెన్సెక్స్ 398 పాయింట్లు డౌన్ 
  2. 25,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబై, సెప్టెంబర్ 11: కీలకమైన హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, లార్సన్ అండ్ టుబ్రోల్లో ఇన్వెస్ట ర్లు అమ్మకాలు జరపడంతో భారత్ సూచీలు రెండు రోజుల అప్‌ట్రెండ్‌కు బుధవారం బ్రేక్ వేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 398 పాయి ంట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. సెన్సె క్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 82,134 పాయి ంట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం అమ్మకాలు మొదయ్యాయి.

దాంతో 498 పాయి ంట్ల మేర తగ్గి 81,423 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. చివరకు 398 పాయి ంట్ల నష్టంతో 81,523 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రా డేలో 25,100 పాయింట్లపైకి చేరిన తర్వాత జరిగిన అమ్మకాల ప్రభావంతో కీలకమైన 25,000 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. చివరకు 122 పాయింట్లు నష్టంతో 24,918 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇన్వెస్టర్ల ముందుజాగ్రత్త

ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్లకు పతనంకావడంతో ఇతర ఆసియా మార్కెట్ల తరహాలోనే దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప క్షీణతను చవిచూశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యూఎస్ ద్రవ్యోల్బణం, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్త వహిం చారని రెలిగేర్ బ్రోకి ంగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆసి యాలో సియోల్, టోక్యో, షాంఘై, హాం కాంగ్‌లు నష్టపోయాయి.

టాటా మోటార్స్ టాప్ లూజర్

ఎలక్ట్రికల్ వాహనాల ధరల్ని భారీ గా తగ్గించిన టాటా మోటార్స్ సెన్సెక్స్ బాస్కెట్ లో అన్నింటికంటే అధికంగా 6 శాతం పతనమై రూ.970 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, లార్సన్ అండ్ టుబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్‌లు 3 శాతం వరకూ తగ్గాయి.  మరోవైపు ఏషియ న్ పెయింట్స్, బజా జ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 3 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.25 శాతం తగ్గింది.

మెటల్ ఇండెక్స్ 1.35%, యుటిలిటీస్ ఇండెక్స్ 1.29%, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.17%, కమోడిటీస్ ఇండెక్స్ 1.14%, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.84% చొప్పున తగ్గాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు లాభ పడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.57%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.52% చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,587 షేర్లు లాభపడగా, 1,352 షేర్లు తగ్గాయి.