calender_icon.png 18 October, 2024 | 11:53 PM

ఎగుమతుల క్షీణతకు బ్రేక్

17-10-2024 12:42:24 AM

సెప్టెంబర్‌లో 34.58  బిలియన్ డాలర్లకు పెరుగుదల

రెండు నెలల తర్వాత వృద్ధి

5 నెలల కనిష్ఠానికి వాణిజ్యలోటు

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: వరుసగా రెండు నెలలు క్షీణించిన ఎగుమతులు సెప్టెంబర్ నెలలో  స్వల్పంగా పెరిగి 34.58 బిలియన్ డాలర్లకు చేరాయి. బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల  ప్రకారం సెప్టెంబర్ నెలలో దిగుమతులు 1.6 శాతం పెరిగి 55.36 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఈ ఏడాది జూలైలో 1.2 శాతం, ఆగస్టులో 9.3 శాతం చొప్పున ఎగుమతులు క్షీణించాయి సెప్టెంబర్‌లో ఎగుమతులు, ది గుమతులు మధ్య వ్యత్యాసమైన  వాణిజ్యలోటు 5 నెలల కనిష్ఠం 20.78 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 19.82 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు త ర్వాత ఇదే కనిష్ఠస్థాయి. 

ఇది 2024 ఆగస్టు నెలలో 10 నెలల గరిష్ఠస్థాయి 29.65 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో ఎగుమతులు 1 శాతం పెరిగి 213.22 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 6.26 శాతం వృద్ధితో 350.66 బిలి యన్ డాలర్లకు పెరిగాయి.

137.44 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యిం ది.  ఇంజనీరింగ్, కెమికల్స్, ప్లాస్టిక్స్, ఫార్మా, గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో వృద్ధి అధికంగా ఉన్నదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నా, గత ఆరు నెలల్లో ఎగుమతుల్లో వృద్ధి నమోదయ్యిందన్నారు. 

పెరిగిన పుత్తడి దిగుమతులు

సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు స్వల్పంగా వృద్ధిచెంది 4.39 డాలర్లకు చేరాయి. నిరుడు ఇదే నెలలో 4.11 బిలియన్ డాలర్ల విలువైన  బంగారం దిగుమతయ్యిం ది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో పసిడి దిగుమతులు 6.9 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరాయి.  సెప్టెంబర్‌లో వెండి దిగుమతులు 106.64 మిలియన్ డాలర్ల నుంచి దాదాపు మూడు రెట్లు పెరిగి 325.66 మిలియన్ డాలర్లకు చేరాయి.

ప్రధమార్థంలో ఇదేరీతిలో వృద్ధిచెంది 480 మిలియన్ డాలర్ల నుంచి 2.29 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మరోవైపు సెప్టెంబర్‌లో క్రూడాయిల్ దిగుమతులు 10 శాతం మేర క్షీణించి 12.53 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో 5.91 శాతం వృద్ధిచెంది 88.91 బిలియన్ డాలర్లకు చేరాయి.