హైదరాబాద్: దేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. మూడు రోజులుగా వరుస పెరుగుదలతో కొనుగోలుదారులలో దడ పుట్టించిన పసిడి రేట్లు గురువారం నిలకడగా నమోదై ఉపశమనం కలిగించాయి.మూడు రోజుల్లో బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ. 1800 పైగా ఎగిసింది.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,470 ఉంది.
రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.73,000 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,620 వద్ద ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.72,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 79,470 లుగా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు చేరగా ఢిల్లీలో రూ.96,500 వద్దకు ఎగిసింది.