calender_icon.png 17 January, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపాదనలకు బ్రేక్

17-01-2025 12:09:24 AM

కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే

కరీంనగర్, జనవరి 16 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 40 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసేందుకు సహకారశాఖ ప్రతిపా దన చేసి టెస్కాబ్కు పంపించింది. గురువా రం హైదరాబాద్లో టెస్కాబ్ చైర్మన్ అధ్యక్ష తన ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉండగా, సమావేశం జరగకపోవడంతో బ్రేక్ పడినట్లయింది.

ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మ డి జిల్లా పరిధిలో 135 పీఏసీఎస్ లు ఉన్నా యి. అందులో 132 జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో, మూడు సొసైటీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో 30 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 24, జగిత్యా ల జిల్లా పరిధిలో 51, పెద్దపల్లి జిల్లా పరిధిలో 20 సంఘాలు ఉన్నాయి.

మొద ట్లో సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 208 వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా నష్టాల కారణంగా 73 సంఘాలను దగ్గరలోని సంఘాలలో విలీనం చేశారు. ఇ టీవల కాలంలో సహకార సంఘాలు మంచి వ్యాపారాన్ని చేస్తుండడంతో కొత్తగా సంఘా లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించారు. కరీంనగర్ జిల్లా పరిధిలో ఏడు సంఘాలను ప్రతిపాదించారు.

కొత్తపల్లి మండలం ఎల గందల్, చిగురుమామిడి మండలం ఇందు ర్తి, సైదాపూర్ మండలం రాములపల్లి, బొ మ్మకల్, గన్నేరువరం, గన్నేరువరం మండ లంలోని గుండ్లపల్లి, వీణవంక మండలం చల్లూరులను ప్రతిపాదించారు. జగిత్యాల జి ల్లాలో లక్ష్మీపూర్, మోరపల్లి, పోరండ్ల, మద్దు లపల్లి, రాపల్లి, వర్షకొండ, జగ్గసాగర్, న్యూ ధర్మరాజ్పల్లి, బుగ్గారం, మన్నెగూడెం, అంబారిపేట, కట్కాపూర్, ముత్యంపేటలను ప్రతిపాదించారు.

ఇదిలా ఉంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియనుంది. సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లే జరిగే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన తప్పడు. కాంగ్రెస్ ప్రభుత్వం సహకార సం ఘాల ఎన్నికల తేదీ ప్రకటించిన అనంత రమే కొత్త పీఏసీఎస్‌లను ప్రకటించే అవకాశం ఉంది.