calender_icon.png 5 December, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస నష్టాలకు బ్రేక్

20-11-2024 12:00:00 AM

  1. 1,000 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులు
  2. చివరకు 239 పాయింట్ల లాభం
  3. 23,500 పాయింట్లపైన నిఫ్టీ

ముంబై, నవంబర్ 19:  బేర్స్ నుంచి మార్కెట్‌పై పట్టు చేజిక్కించుకునేందుకు బుల్స్ జరిపిన పోరులో కొంతమేర విజయం సాధించగలిగారు. 7 రోజుల వరుస మార్కెట్ నష్టాలకు బ్రేక్ వేయగలిగారు. మంగళవారం 1,000 పాయింట్ల రేంజ్‌లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 239 పాయింట్ల లాభంతో  77,578 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్ తొలుత 1,112 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపిన సెన్సెక్స్ 78,541  పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అటుపై పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరగడంతో గరిష్ఠస్థాయి నుంచి 950 పాయింట్లు  కోల్పోయి,  పరిమిత లాభంతో ముగిసింది.

ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23,780 పాయింట్ల మధ్య 300 పాయింట్ల శ్రేణిలో ఎగిసి పడిన అనంతరం చివరకు 64 పాయింట్ల లాభంతో కీలకమైన 23,500 స్థాయిపైన 23,518 పాయింట్ల వద్ద ముగిసింది.  గత ఏడు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 3,000 పాయింట్లు, నిఫ్టీ 1,030 పాయింట్ల చొప్పున కోల్పోయాయి. తాజా ట్రేడింగ్ సెషన్లో బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.

మహారాష్ట్ర ఎన్నికలపై ఇన్వెస్టర్ల అప్రమత్తం

కనిష్ఠ విలువల వద్ద జరిగిన కొనుగోళ్లతో పటిష్ఠంగా మార్కెట్ బౌన్స్ అయినప్పటికీ, ఇన్వెస్టర్లు ప్రతీ పెరుగుదలనూ లాభాలు స్వీ కరిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అప్రమత్తత వహిస్తు న్న ఇన్వెస్టర్లు తాజా మార్కెట్ బౌన్స్ నుంచి లాభాలు తీసుకున్నారని వివరించారు.

నేడు మార్కెట్లకు సెలవు

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా స్టాక్ ఎక్సేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు నవంబర్ 20, బుధవారం సెలవు ప్రకటించాయి.