బ్రెసిలియా, నవంబర్ 17: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లుల డ సిల్వా సతీమణి, ఆ దేశపు ప్రథమ మహిళ జంజా ‘ఎక్స్’ వేదికగా అసభ్య పదజాలంతో దూషించారు. ‘ఎక్స్’లో తప్పుడు సమాచారాన్ని నియంత్రించడంలో అధినేత మస్క్ విఫలమయ్యారని ఆరోపించారు. ఈ పోస్ట్‌పై మస్క్ స్పందిస్తూ.. ఫన్నీ ఎమో జీ పోస్ట్ చేశారు. ఇంతకీ ఫస్ట్ లేడీకి ఎందుకు కోపం వచ్చిందంటే.. ‘ఎక్స్’లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న ఖాతాలను తొలగించాలని బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు జారీచేసింది.
ఈ ఆదే శాలపై ‘ఎక్స్’ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె తీవ్రం గా స్పందించారు. ‘ఎక్స్’ స్పందించనందుకు న్యాయస్థానం బ్రెజిల్‌లో ‘ఎక్స్’ను రెండు నెలల పాటు బ్యాన్ చేసింది. 5.2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.