calender_icon.png 16 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెజిల్ ఇంటిదారి

08-07-2024 02:17:13 AM

  • ఉరుగ్వే చేతిలో ఓటమి 
  • కోపా అమెరికా కప్

లాస్ వెగాస్ (అమెరికా): సాకర్ పవర్‌హౌజ్ బ్రెజిల్ కోపా అమెరికా కప్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ షూటౌట్‌లో బ్రెజిల్ 2 ఉరుగ్వే చేతిలో పరాజయం పాలైంది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ నేమార్ దూరం కావడం.. గత మ్యాచ్‌లో రెండు ఎల్లో కార్డులతో రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ వినిసియస్ సీజర్ అందుబాటులో లేకపోవడం బ్రెజిల్‌ను దెబ్బకొట్టింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ నమోదు చేయలేకపోవడంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించారు. ఉరుగ్వే ప్లేయర్ నహిటన్ నాందెజ్ 74వ నిమిషంలో రెడ్ కార్డుకు గురై మైదానం వీడగా.. మిగిలిన 20 నిమిషాలు 10 మంది ప్లేయర్లతోనే ఆడినా.. ఈ అవకాశాన్ని బ్రెజిల్ సద్వినియోగ పర్చుకోలేకపోయింది. మరో క్వార్టర్ ఫైనల్లో కొలంబియా 5 పనామాపై విజయాం సాధించింది. సెమీస్‌లో కెనడాతో అర్జెంటీనా, కొలంబియాతో ఉరుగ్వే అమీతుమీ తేల్చుకోనున్నాయి.