calender_icon.png 28 December, 2024 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వీరబాలల దినోత్సవం

27-12-2024 12:00:00 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): జగిత్యాలలోని గురుద్వారాలో బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించి గురుద్వారాలో సిక్కు సోదరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణా రాష్ర్ట ప్రభుత్వం గాంధీ, నెహ్రూల జయంతులు వర్ధంతులు నిర్వహించినట్లుగానే డిసెంబర్ 26వ తేదీన వీర బాలల దినోత్సవాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా నిర్వహించి బాలల్లో దేశభక్తి, దైవభక్తి పెంపొదింపచేయాలనీ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్  డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు రాగిల్ల సత్యనారాయణ, యాదగిరి బాబు, నాయకులు సత్యం, రమణ కుమార్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.