calender_icon.png 17 January, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ స్కేర్‌తో నయా బ్రాండ్

15-07-2024 12:10:37 AM

ప్రపంచ యవనికపై హైదరాబాద్‌కు లాండ్‌మార్క్

పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం

టూరిజం, వినోద రంగాలకు ఊతం

వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి

దేశంలోనే మొదటి వాణిజ్య ప్లాజాగా గుర్తింపు

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): న్యూయార్క్‌లోని టైమ్స్ స్కేర్ తరహాలో హైదరాబాద్ రాయదుర్గంలో టీ స్కేర్‌ను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించింది. వచ్చే నాలుగున్నరేళ్లలో రూ.5లక్షల కోట్ల ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పని చేస్తోంది. ఈ క్రమంలో టీ స్కేర్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఐటీలో తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్‌కు టీ స్కేర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీని నిర్మా ణ పూర్తయితే అటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఎలాంటి ఉపయోగా లు ఉం డొచ్చు అనే విషయాలను తెలుసుకుందాం.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతి ష్ఠాత్మంగా నిర్మించతలపెట్టిన టీ స్కేర్ ఒక వాణిజ్య కూడలి. హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా సరికొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఒక భారీ వాణిజ్య ప్లాజాను నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు ఐకానిక్ ల్యాండ్ మార్క్‌గా టీ స్కేర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వాణిజ్య వ్యాపార కేంద్రం: హైదరాబాద్‌కు నయా కార్పొరేట్ లుక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టీ స్కేర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాణిజ్య కూడలి పూర్తయితే అది ప్రపంచ స్థాయి వ్యాపార, వాణి జ్య కేంద్రంగా ఖ్యాతి గడించే అవకాశం ఉం దని, ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఉన్న వాణిజ్య కూడళ్లను పరిశీలిస్తే అర్థమవుతుంది.

ఇందు లో తమ హెడ్డాఫీస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ తమ కార్యాలయాలు ఉండటాన్ని కంపెనీలు ప్రతిష్ఠాత్మకంగా భావించే అవకాశం ఉంది. గ్లోబల్ ఫార్చూ న్500 జాబితాలోని ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ప్రపంచస్థాయి కంపెనీలకు అందుబా టులో ఉండేలా రాయదర్గంలో ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది. టీ స్కేర్‌తో నగరానికి గ్లోబల్ ఇమేజ్ వస్తుంది. తద్వారా ప్రపంచస్థాయిలో మరిన్ని కంపెనీలను పెట్టుబడి పెట్టడానికి ఆకర్షించడానికి, ఇప్పుడున్న సం స్థలు ఇక్కడే విస్తరించుకోవాలనుకునే ఆలోచనను రేకెత్తించడానికి ఈ చర్య దోహదపడు తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభివృద్ధి వసతులు

టీ స్కేర్ నిర్మాణంతో హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా దూసుకుపోతుందని సర్కారు భావిస్తోంది. ఈ ప్రాంతంలో మౌ లిక వసతులు గతంలో కంటే మెరగవుతాయి. ఇది ప్రపంచ స్థాయి నిర్మాణం కావడంతో ఆ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక అంశం మౌలిక వసతుల కల్పనే. అం దు కే రవాణా, నీరు, విద్యుత్ తదితర అంశాలు మరింత మెరుగవనున్నాయి. ఈ పరిణామం రియల్ ఎస్టేట్‌కు దోహదపడుతుంది.

టూరిజ స్పాట్

ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న వాణిజ్య కూడళ్లు పర్యాటకులకను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. న్యూయార్క్‌లోని టైమ్స్ స్కేర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా లాంటి సముదాయాలను సందర్శించేందుకు టూరిస్టులు ఆసక్తిని చూపిస్తుంటారు. వాటి మాదిరిగానే టీ స్కేర్‌ను టూరిస్ట్ స్పాట్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. ఇది తెలంగాణ పర్యాటక రంగ వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వినోదం

ఈ వాణిజ్య కూడలిని మంచి ప్రైమ్ ప్రాంతంలో నిర్మిస్తుండంతో ప్రముఖ కంపెనీలు తమ రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులను ఆకర్షించడానికి ఇతర వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. 

ఉపాధి కల్పన

టీ స్కేర్ నిర్మించిన తర్వాత అందులో ఏర్పాటు చేసే ఆఫీసులు, హోటల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా విభాగాల్లో ప్రత్య క్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే కంపెనీలతో మరికొంత మందికి ఉపాధి దొరకనుంది.

సినిమా షూటింగ్స్-ప్రదర్శనలు

టైమ్స్ స్కేర్, బుర్జ్ ఖలీఫా లాంటి కూడళ్లలో నిత్యం సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పటికే సినిమా చిత్రీకరణకు హైదరాబాద్ హబ్‌గా ఉంది. దేశంలోని అన్ని భాషల షూటిం గ్స్ హైదరాబాద్‌లో జరుగుతుంటాయి. టైమ్స్ స్కేర్ లాంటి లోకేషన్ల కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే హైదరాబాద్‌లోనే దీన్ని నిర్మించడం వల్ల అక్కడి వెళ్లకుండా ఇక్కడే చిత్రీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే, తెలంగాణ కల్చర్‌ను ప్రదర్శిచండానికి టీ స్కేర్ ఉప యోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వేదికపై ప్రదర్శించడం ద్వారా దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను చెప్పడానికి టీ స్కేర్ వేదికగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డిజిటల్ డిస్‌ప్లేలు

టైమ్స్ స్కేర్, బుర్జ్ ఖలీఫా లాం టి ప్రపంచస్థాయి వాణిజ్య కూడళ్లలో బిల్ బోర్డులు, డిజిటల్ డిస్‌ప్లేలపై ప్రకటనకు చాలా విలువ ఉంటుంది. తెలుగు సినిమాల ట్రైలర్లను చాలా వరకు టైమ్స్ స్కేర్ వద్ద ప్రదర్శించారు. వాటికి ఉన్న బ్రాండ్ కారణం గా అక్కడ ఏదైనా ప్రదర్శిస్తే క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అందుకే ఖర్చుకు వెనుకాడ కుండా బిల్ బోర్డులు, డిజిటల్ డిస్‌ప్లేలపై ప్ర కటనలను ప్రదర్శిస్తారు. టీ స్కేర్‌ను కూడా ఆ స్థాయిలో నిర్మిం చే బిల్ బోర్డులు, డిజిటల్ డిస్‌ప్లేలపై ప్రకటనలు ప్రదర్శించేలా సర్కారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వృద్ధికి దోహదం

2030 నాటికి 2.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల కల్పన, లావాదేవీలు, నూతన ఆవిష్కరణలు అనేవి చాలా కీలకం. తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో టీ స్కేర్ కీలక భూమిక పోషిస్తుందని సర్కారు భావిస్తోంది.