13-04-2025 12:36:21 AM
* రాష్ట్రంలో రూ.2వేలకోట్లతో రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ
* అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా తీర్చిదిద్దుతున్న రైల్వేశాఖ
* ప్రయాణికులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే లక్ష్యం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా రైల్వేలను ఆధునీకీకరించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చింది. ఇందులోభాగంగా రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్,క్వాడ్రప్లింగ్ చేస్తున్నారు. అమృత్‌భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వేస్టేషన్లనూ అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు.
తాజా గా రాష్ట్రంలోని చర్లపల్లి రైల్వేటెర్మినల్‌ను రూ. 413కోట్లతో అత్యాధునికంగా నిర్మించారు. దీంతోపాటు రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లను పూర్తిగా ఆధునీకీకరిస్తున్నారు. ఇందుకోసం రూ.2వేలకోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. వీటిలో పలు స్టేషన్ల పనులు 90శాతం పూర్తయ్యాయి. మరికొన్ని స్టేషన్లు 40నుంచి 90 శాతం వరకు పనులు జరిగాయి.
అన్ని ప్రధాన స్టేషన్ల ఆధునీకీకరణ..
నగరంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ జరుగుతోంది. రైల్ టెర్మినల్స్ గా ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడతోపాటు బేగంపేట, హైటెక్ సిటీ, హఫీ జ్‌పేట్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, ఉప్పుగూ డ, యాకుత్‌పురా వంటి చిన్న స్టేషన్‌లు ఇప్పుడు ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుంటున్నాయి. హైదరాబాద్‌ేొ-ముంబై మార్గంలో ఉన్న ముఖ్యమైన స్టేషన్లలో ఒకటైన బేగంపేట పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు.
విశాలమై న రోడ్లు, ఆటోమేటిక్ ఎలివేటెడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్రణాళికాబద్ధమైన పార్కింగ్, మెరుగైన లైటింగ్,ల్యాండ్‌స్కేపింగ్, స్థానిక కళా సంస్కృతి ఉట్టిపడేలా డిజైన్లు, ఉన్నత-స్థాయి ప్లాట్‌ఫారమ్‌లు మొదలైన నూతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కాచిగూడ రైల్వే టెర్మినల్‌ను రూ.474కోట్ల తో, హైదరాబాద్ స్టేషన్‌ను రూ.327కోట్ల తో, లింగంపల్లి టెర్మినల్‌ను రూ.310కోట్లతో చర్లపల్లి తరహాలో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి స్టేషన్ 70 శాతం, ఖమ్మం, కాజీపేట 45శాతం పనులు పూర్తయ్యాయి.
అత్యున్నత సౌకర్యాలతో సికింద్రాబాద్ స్టేషన్..
రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.700 కోట్లతో రైల్వేశాఖ ఆధునీకరి స్తోంది. ఇప్పటివరకు 75 శాతం వరకు పను లు పూర్తయ్యాయి. 2025 చివరి నాటికి ఈ స్టేషన్ పనులను పూర్తి చేయాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే అనేక రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్, లింగంపల్లి, మల్కాజ్‌గిరి, ఉందానగర్ తదితర స్టేషన్లకు తరలించారు.
ఉత్తరాన జీప్లస్ 3 అంతస్తులతో కొత్త స్టేషన్ భవనం, దక్షిణం వైపున జీ ప్లస్3 అంతస్తులతో మరొక భవనం, ఒకే చోట ప్రయాణికుల సౌకర్యాలతో కూడిన డబుల్-స్టోరీ స్కు కాన్కోర్స్, క్యాపిటేరియా, వినోద సౌకర్యాల కోసం నిర్మాణాలుంటాయి. స్టేషన్‌లో బహుళ-స్థాయి, అండర్‌గ్రౌండ్ పార్కింగ్, స్కైవేలు, ట్రావెలేటర్లు, ఎస్కలేటర్లు ప్రయాణ అనుభూతిని మార్చేస్తాయి. 5వేల కిలోవాట్ పవ ర్ సౌర విద్యుత్ ప్లాంట్‌తో స్టేషన్ విద్యుత్ అవసరాలు తీరతాయి.
రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పలు స్టేషన్ల వివరాలు
(నిధులు రూ.కోట్లలో)
నిజామాబాద్ జంక్షన్ రూ.53.3
కామారెడ్డి రూ.39.9
మహబూబ్‌నగర్ రూ.39.9
మలక్‌పేట్ రూ.36.4
మల్కాజ్‌గిరి రూ.27.6
ఉప్పుగూడ రూ. 26.8
మహబూబాబాద్ రూ.39.7
హఫీజ్‌పేట్ రూ.26.6
హైటెక్‌సిటీ రూ.26.6
కరీంనగర్ రూ.26.6
రామగుండం రూ.26.5
ఖమ్మం రూ. 25.4
మధిర రూ.25.4
జనగామ రూ.24.5
కాజీపేట్ రూ.24.5
యాదాద్రి రూ.24.5
భద్రాచలం రోడ్ రూ.24.4
తాండూర్ రూ.24.4
జహీరాబాద్ రూ.24.0