నటి రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమి తులయ్యారు. కేంద్ర హోంశాఖకు చెం దిన సైబర్ దోస్త్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. రష్మిక సైతం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తాను గతంలో ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి కూడా ఆమె మాట్లాడా రు. ‘కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది.
అది సైబర్ నేరం కావడంతో నేను దానికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నా. అంద రికీ సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలనుకున్నా. ఈ క్రమంలోనే నన్ను సైబ ర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర హోంశాఖ నియమించిందని చెప్పడానికి సంతోషిస్తున్నా.
సైబ ర్ నేరగాళ్లు మనల్ని టార్గెట్ చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటారు. వారి బారిన పడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇకపై ఈ నేరాలపై నేను అవగాహన పెంచుతాను. సైబర్ నేరాల నుంచి దేశాన్ని కాపాడుతా’ అని రష్మిక తెలిపారు.