డాక్టర్స్ డే సందర్భంగా రెనోవా హాస్పిటల్స్ చీఫ్ న్యూరాలజీ డాక్టర్ జేఎమ్‌కే మూర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): డాక్టర్స్ డే సందర్భంగా రెనో వా హాస్పిటల్స్ చీఫ్ న్యూరోలజీ వైద్యులు జేఎమ్‌కే మూర్తి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడు తూ.. రోజురోజుకు మారుతున్న జీవనశైలితో మనిషి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, స్ట్రోక్ వచ్చినపుడు త్వరగా స్పందించాలని ఆయన సూచించారు. సమతుల్యత కోల్పోవడం, తలనొప్పి, తల తిరగడం, ఒకటి లేదా రెండు కళ్లలో చూపు కోల్పోవడం, వ్యక్తి ముఖం అసాధారణంగా ఉండటం, చేతులు బలహీనంగా మారడం, మాట్లాడలేకపోవడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలని తెలిపారు.