calender_icon.png 10 January, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఉద్యమ పటిష్టతకు మేధోమథన సదస్సు

03-11-2024 03:54:46 AM

5న జరిగే సదస్సుకు బీసీలు తరలిరావాలి 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు- ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): బీసీ ఉద్యమ పటిష్టతకు మేధో మథన సదస్సును నిర్వహించనున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  కాచిగూడలోని అభినందన గ్రాండ్ హోటల్ హాల్‌లో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న సదస్సుకు బీసీలు తరలిరావా లని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్య దర్శి పీ సుధాకర్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు.

ప్రస్తు తం ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, పెండింగ్ లో ఉన్న రూ.5 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ.10 లక్షల రుణం ఇవ్వాలని, ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే భరించాలని, ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపనున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి స్కీ ములను రూపొందించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా రా జ్యాంగ సవరణ చేయాలని, బీసీలకు సామాజిక రక్షణ, భద్రత యాక్ట్‌ను తీసుకురావాలని, కేంద్రంలో, రాష్ట్రంలో బీసీల ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెం చాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపుతామని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం నాయకులు వేముల రామకృష్ణ, అనంతయ్య, నందగోపాల్, ఉదయ్, రవి, బాలయ్య  పాల్గొన్నారు.