* బ్రెయిన్ ట్యాప్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మెదడు ఆరోగ్యాన్ని పెంపొం లక్ష్యంగా బ్రెయిన్ ట్యాప్ ఆధ్వర్యంలో టీ హబ్‌లో అత్యాధునిక మెదడు ఫిట్‌నెస్ టెక్నాలజీని ఖజకిస్తాన్ కాన్సుల్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ ఆవిష్కరించారు.
ఈ క్రమంలో బ్రెయిన్‌టాప్ వ్యవస్థా సహ సీఈవో డాక్టర్ పాట్రిక్ పోర్టర్, సహ వ్యవస్థాపకురాలు సీఎంవో సింథియా పోర్టర్, బ్రెయిన్ ట్యాప్ బోర్డు డైరెక్టర్ విషాల్ బైజాల్, చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ ఫ్రాన్సిస్కో సిడ్రల్, న్యూరో ప్రై.లి. సీవోవో ఛయాల్ బైజాల్, బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ హర్షిల్‌మౌన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రె ట్యాప్ వ్యవస్థాపకుడు, సహ సీఈవో డాక్టర్ ప్యాట్రిక్ పోర్టర్ మాట్లాడుతూ తమది అగ్రగామి బ్రెయిన్ ఫిట్‌నెస్ కంపెనీ అన్నారు. సంకల్పాన్ని పెంపొందించడానికి, నిద్రను మెరుగుపరచడానికి, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుందని తెలిపారు. ఆరోగ్యానికి విప్లవాత్మకమైన బ్రెయిన్ వేవ్ టెక్నాలజీని అందిస్తున్నామన్నారు.
ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఓంప్రకాశ్ మా బ్రెయిన్‌టాప్ ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉంటుందన్నారు. కా జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్, రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్ అజయ్‌మిశ్రా, ఎల్‌వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ సుభద్రా, అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ ఫిజిషియన్ ఆశిష్ చౌహాన్ పాల్గొన్నారు.