calender_icon.png 28 April, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడు వయసుకు చెక్!

20-04-2025 12:00:00 AM

మెదడు.. శరీరంలో ఓ భాగమైతే కావచ్చు. కాని దానికంటూ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మనం వందేళ్లు బతకాలంటే.. వందేళ్లపాటు స్థిమితంగా ఆలోచించగలగాలి. మంచిచెడుల్ని విశ్లేషించే పదును ఉండాలి. ఇదంతా జరగాలంటే.. మెదడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాని అరవై నిండిన తర్వాత ఏటా 0.5 శాతం చొప్పున మెదడు పనితీరు మందగిస్తూ వస్తుంది. ఆ క్షీణతను అడ్డుకోవాల్సిందే.

మెదడుకు బద్ధకాన్ని అలవాటు చేయకూడదు. నిత్యం ఏదో ఓ పని చెప్పాలి. సవాళ్లు విసరాలి. పజిల్స్, చదరంగం, పుస్తక పఠనం లాంటివి ఆ ప్రయత్నంలో సహకరిస్తాయి. పర్యటనలు మెదడును మరింత యవ్వనంగా ఉంచుతాయి. ఎందుకంటే ప్రతి ప్రయాణం తర్వాతా ఎన్నో కొన్ని అనుభూతుల్ని మూటగట్టుకుని వస్తాం.

ఆ సరికొత్త జ్ఞాపకాలు మెదుడుకు విటమిన్ టాబ్లెట్‌తో సమానం. మెదడు ఆరోగ్యంలో ధ్యానం పాత్రా కీలకమైందే. పోషకాలు, సామాజిక సంబంధాలు.. మొదలైనవి గుండెకే కాదు, మెదడుకూ మంచి చేస్తాయి. అందులోనూ ఒత్తిడి కారణంగా స్రవించే కార్టిసోల్ హార్మోన్ మెదడును ప్రధాన శత్రువని గుర్తించారు నిపుణులు.