- జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయాలి
ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఈ నెల 8 నుండి 12 వరకు వరకు జరిగే నల్లగొండ శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మో త్సవాల జాతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసా ద్ పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ ఆవరణను, జాతరల కార్యక్రమాలు,
ఏర్పా ట్లను సంబంధిత అధికారులతో కలిసి బుధ వారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి జాతర జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు.
ఇందులో భాగంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి దేవాలయం తరపున చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలని సూచించారు. సుమారుగా 10 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గుట్టపైన తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాలని, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓను ఆదేశిం చారు.
మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందు కు ఆర్టీసి బస్సులను కచ్చితంగా ట్రిప్స్ వేయాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు.
ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరుగ కుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుం డా నల్లగొండ శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి జాతర ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు షిఫ్టుల వారీగా అధికారులు, సి బ్బంది సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పార్కింగ్ స్థలంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కొండ చివరి ప్రాంతం అయి నందున భక్తులు ప్రమాదకరమైన ప్రదేశా లలో ఫోటోలు తీసుకునే సమయంలో ఎటు వంటి అవాంఛనీయ ఘటనలు జరుగ కుండా ప్రమాద సూచికల బోర్డులు,
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలని తెలిపారు. అనంత రం ఆలయ అర్చకులు అర్చన చేసి కలెక్టర్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ఇంచార్జీ డి.పి.ఓ. మదన్ మోహన్, నల్లగొండ ఆలయ ఈఓ వెంకన్న, ఎమ్మార్వో, ఎంపీడీఓ పాల్గొన్నారు.