calender_icon.png 7 March, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

06-03-2025 10:31:12 PM

పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు..

మాడ వీధుల్లో శ్రీవారి పల్లకిని మోసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న దశమ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని "తెలంగాణ తిరుమల దేవస్థానం" శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గురువారం పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గురువారం ఉదయం శ్రీశ్రీశ్రీ దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారిచే తీర్థ గోష్ఠి, శాంతి పాఠము, ద్వార తోరణ పూజ, ధ్వజ కుంభారాధన, నిత్యహావనం, పూర్ణాహుతి అనంతరం మాడవీధుల్లో హంస వాహనంపై స్వామి వారిని ఊరేగించారు.

గురువారం సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీనివాసుని రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప, పోచారం సోదరుడు శంబురెడ్డి దంపతులు, పోచారం సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.