calender_icon.png 3 March, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టపై వైభవంగా బ్రహ్మోత్సవాలు

03-03-2025 12:14:10 AM

కొనసాగుతున్న భక్తుల రద్దీ 

ఈనెల 11వరకు ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి, మార్చి 2 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరు గుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం స్వామివారికి ఆలయంలో నిత్యరాధనల అనంతరం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజా రోహణ కార్యక్రమాలు జరిపారు.

పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు పారాయణి వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెల్ల వస్త్రంపై గరుఢాన్ని చిత్రించి, 27 విధాలైన ఉప ప్రచారాలో పూజాధికాలు నిర్వ హించారు. మూర్తికి ముద్గనాన్ని నివేదించారు. సంతానాన్ని పొందని స్త్రీలు ఈ ముద్గాన్న ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం సంతానం కలుగుతుందని ఆర్యోక్తి.  సాయంత్రం వేరిపూజ, దేవత ఆహ్వానం, హవనం ప్రారంభించారు.

శబ్ద బ్రహ్మోపాసానికి సూచికంగా ఆయా రాగ తాళాలతో మంత్రబద్ధమైన శ్లోకాలను పటిస్తూ, భేరి తాడవం చేస్తూ ఈ వేడుక నిర్వహించారు. భేరి తాడవం ఎంతవరకు వినిపించునో అంతవరకు సమస్త శుభాలు కలుగుతాయని ప్రతీతి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సహస్రావధాని, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు నరసింహ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈనెల 11 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.