calender_icon.png 22 December, 2024 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..!

07-10-2024 11:32:42 AM

ఐదవ రోజు స్కందమాతగా భక్తులకు దర్శనం.

గ్రామోత్సవంలో ఊరేగనున్న స్వామిఅమ్మవార్లు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో ఐదో రోజు సోమవారం దుర్గామాత స్కందమాత అలంకరణలో  భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి 8 గంటల సమయంలో గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా వాహన సేవ నిర్వహించినట్లు తెలిపారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు వాహన సేవలు అమ్మవారికి నవదుర్గ అలంకరణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు జపాలు, పారాయణాలు, రుద్ర యాగం, చండీయాగం వంటి కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.