28-02-2025 01:52:46 AM
ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్
తిమ్మాపూర్, ఫిబ్రవరి 27 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ టిఎన్జీవో రాష్ర్ట అధ్యక్షులు మారం జగదీశ్వర్ కోరారు.
గురువారం ఎల్‌ఎండి కాలనీ పద్మావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుంచి పూజా కార్యక్రమాలతో పాటు మార్చి 2 న ఒగ్గు కథ తోపాటు 4 న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కరీంనగర్ నలుమూలల నుంచి భక్తులు స్వామివారి కల్యాణానికి హాజరై తిలకించి పునీతులు కావాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తమ కమిటీ ఆధ్వర్యంలో చల్లని పందిళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఒంటెల రవీందర్ రెడ్డి పోలుకిషన్ గంగరపు రమేష్ శ్రీనివాస్ రాజయ్యలతోపాటు ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు పాల్గొన్నారు.