22-02-2025 01:12:29 AM
యాగశాలలో చతుస్థానార్చన హోమాలు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతు న్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆలయంలోని యాగశాలలో రుత్వీగులు చతుస్థానార్చన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తెల్లవారు జా మున అర్చకులు వేదమంత్రోచ్ఛర ణలతో బంగారుబావి నుంచి సువర్ణ బిందెలో నీటిని తెచ్చి అభిషేకించారు. ఉదయం స్వర్ణాభర ణాలు, పుష్పాలతో స్వామివారిని అలంకరిం చి సహస్ర నామార్చన చేశారు. దివ్యదేశ బహుమాన సమర్పణలో భాగంగా నరసిం హ స్వామి అవతరించిన క్షేత్రం నవ నరసిం హులు ఒకేచోట దర్శనమిచ్చే ఆంధ్రప్రదే శ్లోని అహోబిల నుంచి నరసింహస్వామి ధరించిన మాల చందనం పట్టువస్త్రాలు ఆలయ ప్రధానార్చకుడు శ్రీమాన్ కిడాంబి మధు సూదన్ తీసుకువచ్చి స్వర్ణగిరి ఆల యం వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామా రావు అందించారు.
శ్రీవల్లిపుత్తూరు ఆండాళ్ మనవాళ మహాముని మఠం పీఠాధిపతి శఠగోప రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనాలు అనుగ్రహించారు. ఇష్ఠి యాగ శాలలో లక్ష్మీనారాయణ హావనం చేపట్టారు. నిత్య పూర్ణహుతితో హోమ ఫలాన్ని స్వామికి సమర్పించారు. అనంతరం తిరుమాడ వీధు ల్లో స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండు వగా నిర్వహించారు.
దాదాపు 4వేల మంది భక్తులకుఅన్నదానం చేశారు. కాగా ఈ నెల 19న స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలు వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగనున్నాయి. మరో వారంపాటు ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు జరుగనున్నాయి. మానేపల్లి రామారావు, మురళీకృష్ణ దంపతులు స్థానా చార్యులు శ్రవణాచార్యులు, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.