calender_icon.png 2 February, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-01-2025 12:00:00 AM

చేర్యాల, జనవరి 26 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మో త్సవాల్లో భాగంగా లస్కర్ వారంగా పిలవబడే ఆదివారానికి సైతం హైదరాబాదు నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఆదివారం తెల్లవారు జాము నుండే భక్తులు స్వామి వారి పుష్కరణిలో స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో గర్భగుడిలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గంగిరేణి చెట్టు కింద స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.  సిఐ ఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖవారు  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.