విద్యుత్ కాంతులతో వెలుగునీలుతున్న జైనథ్‌లోని లక్ష్మీనారాయణసామి ఆలయం
- ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు
- నేడు జైనథ్ లక్ష్మీ నారాయణసామి కల్యాణోత్సవం
- 20న రథోత్సవంతో ముగింపు
ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో జైనథ్‌లో ఉన్న ఏకశిల లక్ష్మీ నారాయణ సామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పుణ్యక్షేత్రానికి ఘనమైన చరిత్ర ఉంది. గత 800 ఏళ్ల క్రితం నల్లటి ఏకశిలతో నిర్మాణం జరిగింది. జిల్లాలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన లక్ష్మీ నారాయణ సామి పుణ్యక్షేత్రం ఒకటి. నేడు సామివారి కల్యాణోత్సవంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 20వ తేదీన రథోత్సవంతో ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం చుట్టూ ఉన్న నల్ల రాతి బండపై ఆనాటి శాసనాలు లిఖించబడి ఉన్నాయి. ఆలయం ఎదుట ఉన్న కోనేరు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. గర్భగుడిలో కొలువైన లక్ష్మీనారాయణ సామి వారి పాదాలకు సంవత్సరంలో రెండుసార్లు సూర్యకిరణాలు తాకడం ఆలయం విశిష్టత.
జైనథ్‌లో కొలువైన శ్రీమన్నారాయణడిని కోరికలు తీర్చే సత్య దేవుడిగా, ఆరోగ్యానికి అధిపతి అయిన సూర్యనారాయణడిగా, సంతాన భాగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీనారాయణడిగా భక్తులు కొలుస్తుంటారు. కార్తీక పౌర్ణమి పూర్తి అయ్యేలా 5 పౌర్ణమి పరదినాల్లో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే అంత మంచి జరుగుతోందని భక్తుల ప్రగాఢ నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు సామివారు రోజుకో అవతారంలో భక్తులకు దరనం ఇవనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు భక్తులు సామి దీక్షను సీకరించడం ఆనవాయితీ.
ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక
బ్రహ్మోత్సవాల అనంతరం 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాం తాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సామివారిని దరించుకుంటారు.