12-03-2025 11:10:31 PM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
మునుగోడు,(విజయక్రాంతి): బ్రహ్మోత్సవాలు జాతరలు వేడుకలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్(BC Welfare Association National President Jajula Srinivas Goud) అన్నారు. బుధవారం మండలంలోని కిస్టాపురం గ్రామంలో రుక్మిణీ సత్యభామ సతీసమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలలో ఆయన పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు.ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు, జాతరలు గ్రామాల్లో కొత్త శోభను సంతరించుకుంటాయి. ప్రతి ఒక్కరూ భక్తి భావాలతో దైవ చింతనతో మెలుగుతూ కలిసి మెలిసి జీవనం సాగించాలి తద్వారా మనుగడ సాధ్యం అని అన్నారు. బ్రహ్మోత్సవ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ మునుకుంట్ల కృష్ణయ్య గౌడ్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాజుల అంజయ్య, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నర్సింహా గౌడ్, పలివెల గద్దర్ పాలకూరి కిరణ్ గౌడ్, జాజుల భాస్కర్ గౌడ్, బొడిగె అశోక్ గౌడ్, సురిగి రమేష్ గౌడ్, రాజు, శ్రీను గౌడ్ పాల్గొన్నారు.