15-03-2025 12:00:00 AM
ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి వారి రథాన్ని తాడు లాగి ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ, మార్చి 14 (విజయక్రాంతి): శ్రీ శ్రీ శ్రీ ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హాసన్పర్తి మం డల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వా మి ఆలయం నుంచి ఎర్రగట్టుగుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్లే స్వామివారి రథాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రగుట్టు గుట్ట దేవస్థానం ధర్మకర్తలను శాలువాతో సత్కరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.