27-03-2025 01:37:44 AM
యాదాద్రి భువనగిరి, మార్చి 26 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర సింహ స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు స్వామి వారికి సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. నగదు డబ్బు రూ.4, 43,04,995లు, మిశ్రమ బంగారం 296 గ్రాములు, మిశ్రమ వెండి 13 కిలోలు.
అలాగే విదేశీ కరెన్సీ అమెరికా 1582 డాలర్లు, ఆస్ట్రేలియా 585 డాలర్లు, ఇంగ్లాండ్ - 10 పౌండ్స్, యూఏఈ - 115 దిరమ్స్, నేపాల్ 80 రుపిస్, సౌదీ అరేబియన్ - 100 రియల్, సింగపూర్ 10 డాలర్స్, కతర్ - 250 రియల్, ఒమన్ - 803 బైస, కెనడా 260 డాలర్స్, మలేసియా 17 రింగ్గిట్స్, కువైట్ 1/2 దినర్, న్యూజీలాండ్ 50 డాలర్స్, యూరో 20 యూరస్, భూటాన్ 160, ఇండోనేషియా 100000, నైజీరియా 100, శ్రీలంకా 150, థాయిలాండ్ 40, క్రోనర్ 120, మారిషస్ 100, పోలండ్ 10పౌండ్స్, నిప్పన్ 1000, ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్‌రావు వెల్లడించారు.